
శ్రీదేవి మరణంతో భారతీయ సిని పరిశ్రమ అంతా ఆత్మీయురాలిని కోల్పోయిన బాధలో ఉంటే తమకు తోచిందే వార్తగా రాస్తూ విసుగెత్తిస్తున్నారు కొందరు. శ్రీదేవి ఎలా మృతి చెందారు అన్న దాని మీద ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ కన్నా మీడియా ఇచ్చే రిపోర్టులు ఎక్కువయాయి. శ్రీదేవి మరణ వార్తతో ఎవరికి వారు ఇష్టమొచ్చినట్టు సొంత కల్పితాలు సృష్టిస్తున్నారు.
శ్రీదేవిని బోనీ కపూరే చంపాడని.. ఆమె పేరు మీద 100 కోట్ల ఇన్సూరెన్స్ ఉందని ఓ యూట్యూబ్ ఛానెల్ లో వార్త. నిజంగా ఇలాంటి దారుణాలు కూడా చేస్తారా.. అసలు వారు నిజమైన జర్నలిస్టులేనా అంటూ విమర్శలు చేస్తున్నారు. కేవలం తమకు వచ్చే వ్యూయర్ కౌంట్ కోసం ఇంత నీచంగా వార్తలను పుట్టిస్తారా అంటూ విమర్శిస్తున్నారు.
సెలబ్రిటీస్ మీద ఇష్టమొచ్చినట్టు వార్తలు రాసే కొన్ని యూట్యూబ్ ఛానెల్స్.. మ్యాటర్ ఏది లేకపోతే సినిమాల్లానే కల్పించి మరి కథనాలు అల్లేస్తున్నారు. మరి ఈ దారుణాలు ఎప్పటికి ఆగుతాయో కాని ఈ వార్తలు విన్నవారు మాత్రం షాక్ అవుతున్నారు.