
కింగ్ నాగార్జున సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆఫీసర్. కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాగార్జున లుక్ అదిరిపోయింది. వర్మ సినిమాల ఫస్ట్ లుక్ ఏ రేంజ్ లో ఉంటుందో వాటికి ఏమాత్రం తగ్గకుండా ఈ ఆఫీసర్ లుక్ ఉంది. నిన్న మొన్నటిదాకా గన్, సిస్టెం అంటూ టైటిల్స్ వినపడగా ఈ సినిమాకు అసలు టైటిల్ ఆఫీసర్ అని పెట్టారు. అంతేకాదు క్యాప్షన్ గా ఇలాంటి భయపెట్టే పోలీసుని చూసి ఉండరంటూ ఉంచారు.
దాదాపు పాతికేళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. నాగార్జున ఆఫీసర్ లుక్ బాగుంది. అయితే కాస్త నెగటివ్ షేడ్స్ తో పాటుగా కాస్త మిడిల్ ఏజ్ గా కనిపిస్తున్నట్టు ఉంది. ఇక కొన్నాళ్లుగా పోస్టర్స్ తో సినిమాల మీద క్యూరియాసిటీ పెంచేస్తున్న వర్మ సినిమాలో కంటెంట్ ఆ రేంజ్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవట్లేదు. మరి ఈ ఆఫీసర్ విషయంలో అయినా అన్ని కుదిరాయేమో చూడాలి.
ఈ సినిమాను మే 25న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మైరా సరీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున ఎంకౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించబోతున్నాడు.