
మూవీ మొఘల్ డాక్టర్ డి. రామానాయుడు వారసుడిగా సురేష్ బాబు తమ ప్రొడక్షన్ నిర్మాణ బాధ్యతలను నడిపిస్తున్నాడు. అయితే రామానాయుడు తనయుడిగా వెంకటేష్ హీరోగా సక్సెస్ అవగా నిర్మాతగా సురేష్ బాబు సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు సురేష్ బాబు పెద్ద కొడుకు రానా హీరోగా మంచి సక్సెస్ లను అందుకుంటుండగా సురేష్ బాబు రెండో కొడుకు నిర్మాతగా కొనసాగాలని నిర్ణయించుకున్నాడు.
సురేష్ బాబు రెండవ తనయుడు అభిరాం కూడా హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడంటూ వార్తలు రాగా.. అవేవి నిజం కాదని తెలుస్తుంది. నిర్మాత కొడుకులు కేవలం హీరోగానే కాదు నిర్మాతలుగా కూడా కొనసాగొచ్చు అని నిరూపించాలని చూస్తున్నాడు అభిరాం. నిజంగానే ఇదో మంచి విషయమని చెప్పొచ్చు. ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ సమర్పణలో వచ్చే సినిమాలను మార్కెటింగ్ చేయడంలో అభిరాం మంచి నిపుణత సాధించాడట. మరి నిర్మాతగా అభిరాం ఎప్పుడు స్క్రీన్ పై పూర్తిస్థాయిగా కనిపిస్తాడో చూడాలి.