'మహానటి' శ్రీదేవికి అంకితం..!

సావిత్రి బయోపిక్ గా మహానటి సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను అశ్వనిదత్ నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ సావిత్రిగా నటిస్తున్న ఈ సినిమా మార్చి 29న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను ఇటీవలే అకాల మరణం చెందిన ప్రముఖ నటి శ్రీదేవికి అంకితం ఇస్తున్నట్టు తెలిపారు నిర్మాత అశ్వనిదత్. 

అశ్వనిదత్ నిర్మాణంలో చిరంజీవి, శ్రీదేవి జంటగా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా చేశారు. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాదు చరిత్ర సృష్టించడం జరిగింది. హిందీలో కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. అందుకే మహానటిని శ్రీదేవికి అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఓ మహానటి జీవిత చరిత్రపై వస్తున్న సినిమా మరో మహానటికి అంకితం ఇవ్వడం విశేషంగా చెప్పుకోవచ్చు.