
రాడాన్ నిర్మాణ సంస్థల చైర్మన్.. సీనియర్ హీరోయిన్ రాధిక ట్విట్టర్ అకౌట్ హ్యాక్ అయినట్టు ప్రకటించారు. ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది.. సమస్య సాల్వ్ అయ్యే వరకు తనకు సపోర్ట్ గా నిలవాలని ఫాలోవర్స్ అండ్ ఫ్యాన్స్ ను కోరారు రాధిక. ఈమధ్య సెలబ్రిటీస్ అంతా సోషల్ మీడియాను బాగా ఫాలో అవుతున్నారు. ట్విట్టర్ అనేది మంచి ప్రచార సాధనంగా వాడుతున్నారు.
సెలబ్రిటీస్ తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను కూడా అందులో ఉంచుతున్నారు. అయితే ఈమధ్య సెలబ్రిటీస్ ట్విట్టర్ అకౌంట్స్ హ్యాక్ అవుతున్నాయి. రీసెంట్ గా కిరణ్ బేడి, యాక్టర్ అనుపమ్ ఖేర్ తో పాటుగా బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్ గుప్తాల ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్ కు గురయ్యాయి.