
టాలీవుడ్ సూపర్ హిట్ పెయిర్ కింగ్ నాగార్జున, స్వీటీ అనుష్క మళ్లీ కలిసి రొమాన్స్ చేస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. నాగ్ సూపర్ సినిమాతోనే తెరంగేట్రం చేసిన అనుష్క కమర్షియల్ సినిమాలతో పాటుగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేసింది. రీసెంట్ గా భాగమతితో సూపర్ హిట్ అందుకున్న అనుష్క నాగార్జునతో మరోసారి రొమాన్స్ కు రెడీ అయ్యిందట.
నాగార్జున, నాని కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీలో నాగ్ సరసన అనుష్క ఫైనల్ అయ్యిందట. ఇక నాని పక్కన కన్నడ భామ శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తుందని టాక్. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను అశ్వనిదత్ తనయురాలు ప్రియాంకా దత్ నిర్మిస్తుంది. నాగ్, అనుష్కల సూపర్ హిట్ పెయిర్ ఈ సినిమాకు కలిసి వస్తుందని చెప్పొచ్చు. డాన్ గా నాగార్జున, డాక్టర్ గా నాని కనిపించబోతున్న ఈ సినిమా కథ ప్రేక్షకులను ఎంటర్టైనర్ చేస్తుందని అంటున్నారు. త్వరలో రెగ్యులర్ షూట్ కు వెళ్లనున్న ఈ సినిమాకు ఈమధ్యనే ముహుర్తం పెట్టారు.