
ఎన్.టి.ఆర్ బయోపిక్ గా నందమూరి బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆగష్టు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఉంటుందట. సినిమాలో బాలయ్య ఎన్.టి.ఆర్ గా కనిపిస్తుండగా.. ఎన్.టి.ఆర్ కుర్ర వయసులో ఉన్నప్పుడు కనిపించడానికి మరో హీరోని పెడుతున్నారట. వయసులో ఉన్నప్పుడు ఎన్.టి.ఆర్ కాస్త బక్కపలచగా ఉన్నారు.. ఇప్పటికిప్పుడు బాలకృష్ణ అలా సన్నబడటం కుదరదు. అందుకే మరో హీరోని తీసుకుంటున్నారట.
ఇప్పటికే ఆ హీరో కోసం వేట మొదలు పెట్టారట. అయితే ఆ హీరో ఎవరన్నది మాత్రం చిత్రయూనిట్ సీక్రెట్ గా ఉంచుతుంది. తేజ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో బాలయ్య 62 గెటప్పుల్లో అదరగొడతారని తెలుస్తుంది. 2019 సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా అందరిని సర్ ప్రైజ్ చేసేలా ఉంటుందని చెబుతున్నారు.