మార్చి 1న సూర్య మరో ఇంపాక్ట్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కతం వంశీ డైరక్షన్ లో వస్తున్న సినిమా నా పేరు సూర్య. మే 4 న్యూ రిలీజ్ డేట్ వినపడుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ మాత్రం బాగానే చేస్తున్నారు. ఇప్పటికే న్యూ ఇయర్ రోజు బన్ని ఫస్ట్ ఇంపాక్ట్ ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయగా.. మరో రెండు పాటలను కూడా రిలీజ్ చేసి ఉత్సాహపరచాడు. విశాల్ శేఖర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని సాంగ్ స్పెషల్ గా ఉండబోతున్నాయి.

ఇక ఈ సినిమాకు సంబందించిన మరో స్పెషల్ టీజర్ అదే ఇంపాక్ట్ మరోటి రిలీజ్ చేస్తున్నారట. మార్చి 1న ఈ సినిమా ఇంపాక్ట్ రిలీజ్ అవుతుందట. బన్ని యాంగ్రీ సోల్జర్ గా నటిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తుంది. టీజర్ తో ఇంప్రెస్ చేసిన నా పేరు సూర్య నుండి రాబోతున్న ఈ స్పెషల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.