నాని ఈజ్ ఈక్వల్ టూ పవర్ స్టార్..!

నాచురల్ స్టార్ ఏంటి పవర్ స్టార్ కు ఈక్వల్ అవడం ఏంటి.. ఆయన క్రేజ్ ఎక్కడ మన్వాడి ఇమేజ్ ఎక్కడ. ప్రస్తుతం వరుస సక్సెస్ లను అందుకున్న నాని నాచురల్ స్టార్ అనిపించుకున్నాడు. అయితే ఈమధ్య రిజల్టు బాగున్నా రొటీన్ సినిమాలంటూ వార్తలు వచ్చాయి. మరి అలాంటి నానిని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఎలా పోలుస్తారు అంటే.. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పవన్ కోసం రాసుకున్న ఓ కథను నానితో చేసేయాలని చూస్తున్నారట దర్శక నిర్మాతలు.

అజ్ఞాతవాసి తర్వాత పవన్ కళ్యాణ్ సంతోష్ శ్రీనివాస్ తో సినిమా ప్లాన్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పవన్ ముందు ఓకే అన్నా ఇప్పుడు కాదనేస్తున్నాడు. అయితే ఆ కథను ఇప్పుడు అదే నిర్మాతలు నానితో తీయాలని ఫిక్స్ అయ్యారట. నాని కిశోర్ తిరుమల సినిమా క్యాన్సిల్ అవడంతో నాని సంతోష్ శ్రీనివాస్ సినిమా ఓకే చేశాడట. మొత్తానికి అలా పవన్ కథతో నాని సినిమా వస్తుందన్నమాట.