
రెండేళ్ల క్రితం కెరియర్ కాస్త సందిగ్ధంలో పడినట్టు అనిపించినా మళ్లీ ఊపందుకున్న హీరోయిన్ కాజల్. ఖైది నంబర్ 150తో చిరు రీ ఎంట్రీ ఎంత గ్రాండ్ గా అయ్యిందో కాజల్ కెరియర్ ను అంత గ్రాండియర్ గా కొనసాగేలా చేసింది. ఇక రానా నేనే రాజు నేనే మంత్రి సినిమా కూడా హిట్ అవడంతో కాజల్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇక హీరోయిన్ గా మళ్లీ జోష్ ఫుల్ గా ఉన్న కాజల్ తన మీద వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టేసింది.
ముంబైలో ప్రముఖ పారిశ్రామికవేత్తతో కాజల్ ప్రేమలో పడిందన్న వార్తలతో పాటుగా.. ఓ యువ హీరోతో కాజల్ సన్నిహితంగా ఉంటుందన్న వార్తలు వచ్చాయి. వీటినన్నిటికి కాజల్ సర్ ప్రైజ్ ఆన్సర్ ఇచ్చింది. ఇంతవరకు తనకు నచ్చిన మగాడు తగల్లేదని.. ఒకవేళ అలా ఎవరైనా తారసపడితే తాను వెంటనే చెప్పేస్తానని అంటుంది కాజల్.
ప్రస్తుతం కళ్యాన్ రాం ఎం.ఎల్.ఏ సినిమా చేస్తున్న కాజల్ బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమాలో కూడా హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందట. ఇదే కాకుండా శర్వానంద్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.