
ప్రముఖ సిని నటి శ్రీదేవి (54) శనివారం రాత్రి 11:30 గంటల ప్రాంత్రంలో తీవ్ర గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అంతేకాదు గుండెపోటు వచ్చిన మరికొద్దిసేపటికే ఆమె తుదిశ్వాస విడిచారు. ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యేందుకు దుబాయ్ వెళ్లిన ఆమె అనంతలోకాలకు వెళ్లిపోయారు. తెలుగు, తమిళ, హింది, కన్నడ, మలయాళ సినిమాల్లో దాదాపు 250కి పైగా సినిమాలు చేసిన శ్రీదేవి ఎన్నో కోట్ల మంది హృదయాల్లో ఆరాధ్యదేవతగా ఓ వెలుగు వెలిగారు.
1963 ఆగష్టు 13న తమిళనాడులోని శివకాశిలో శ్రీదేవి జన్మించారు. ఆమె అసలు పేరు శ్రీ అమ్మా యాంగేర్ అయ్యాపాన్. సినిమాల్లోకి వచ్చాక ఆమె శ్రీదేవిగా పేరు మార్చుకున్నారు. 1975లోనే ఆమె తునాయివన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేశారు. తెలుగులో మా నాన్న నిర్దోషి సినిమాలో నటించిన శ్రీదేవి ఆ తర్వాత 80కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగులో 85, హిందీలో 71, తమిళంలో 72, మలయాళంలో 26, కన్నడలో 6 సినిమాల్లో నటించారు శ్రీదేవి.
చివరిగా శ్రీదేవి 2017లో మాం సినిమాలో నటించారు. కెరియర్ లో 15 ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్న శ్రీదేవి. 1996లో బోణి కపూర్ ను పెళ్లిచేసుకున్నారు. 2013లో శ్రీదేవికి భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది.