భానుమతికి 'భాగమతి' కరెక్ట్..!

మహానటి సావిత్రి బయోపిక్ గా వస్తున్న మహానటి సినిమాలో కీర్తి సురేష్ లీడ్ రోల్ చేస్తుండగా సమంత, షాలిని పాండే లాంటి క్రేజీ భామలు స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎవడే సుబ్రమణ్యం నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో భాగమతి అదేనండి స్వీటీ అనుష్క కూడా నటిస్తుందని అంటున్నారు. ఈమధ్యనే భాగమతిగా సూపర్ హిట్ అందుకున్న అమ్మడు ఇప్పుడు మహానటి సినిమాలో భానుమతిగా నటిస్తున్నారట.

అనుష్క ఎంట్రీతో మహానటి సినిమాకు మరింత క్రేజ్ పెరిగిందని చెప్పొచ్చు. ఇక ఏయన్నార్, ఎన్.టి.ఆర్ లతో పాటుగా శివాజి గణేషన్, నాగిరెడ్డి లాంటి పాత్రలు కూడా ఇందులో కనిపిస్తాయి. ఎన్.టి.ఆర్ గా జూనియర్ ను చేయించాలని ప్రయతించగా నో అని చెప్పాడట. అందుకే ఏయన్నార్ గా చైతు కూడా సారీ అనేశాడట. మరి ఈ సినిమాలో ఎవరు ఏ పాత్రలకు చేస్తున్నారు అన్నది తెలియాలంటే మార్చి 29 దాకా వెయిట్ చేయాల్సిందే.