వారు నీచులు, నికృష్ఠులు : మోహన్ బాబు

సిని పరిశ్రమలో ముక్కుసూటిగా మాట్లాడే వారిలో కలక్షన్ కింగ్ మోహన్ బాబు ఒకరు. ఇటీవల గాయత్రి సినిమాతో తన నట విశ్వరూపం చూపించిన మోహన్ బాబు తన సినిమా సక్సెస్ మీట్ లో పైరసీ దారుల మీద మండిపడ్డారు. సినిమాకు ఎంతోమంది కష్టపడి పనిచేస్తాం అలాంటి మా కష్టాన్ని పైరసీ చేసి దోచేస్తున్నారని అన్నారు. పైరసీ చేయడమే కాదు ఆ పైరసీ చూసిన వారు కూడా నీచులు నికృష్ఠులే అంటున్నారు మోహన్ బాబు.

తనకు తగినంత పేరు, డబ్బు ఉన్నాయని.. తన ప్రతిభ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని. అయితే గాయత్రి విషయంలో మాత్రం పైరసీ వల్ల దెబ్బ తిన్నామని అన్నారు. నటుడిగా, నిర్మాతగా కష్ట సుఖాలను చూశామని.. పైరసీ చేసిన వాడికి తల్లి, తండ్రి, భార్యా బిడ్డలు ఉంటారు. ఒకరి ద్రోహం చేస్తే స్వర్గం నరకం ఇక్కడే అనుభవిస్తారు. ప్రస్తుతం బాగుందని అనిపించొచ్చు కాని చేసిన పాపానికి నాశనమవక తప్పదని అన్నారు మోహన్ బాబు.

ఇక మా సినిమాలో ముద్దు సీన్స్ లేవు. ప్రతి ఒకరు వచ్చి చూసే సినిమా.. మంచు విష్ణు ఈ సినిమాతో నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. డబ్బులు ఒకచోట ఎక్కువ, మరో చోట తక్కువ రావొచ్చేమో కాని నిర్మాతగా తనకు సంతృప్తి ఇచ్చిన సినిమా గాయత్రి అని మోహన్ బాబు అన్నారు.