
మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ సిల్వర్ జూబ్లీ ఈవెంట్ డల్లాస్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం మూవీ ఆర్టిస్ట్ అసొషియేషన్ కు సొంత భవనం ఏర్పాటు చేయడమే. అందుకే డల్లాస్ లో ఈ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఈవెంట్ లో పాల్గొంటారని ఎనౌన్స్ చేశారు మా ప్రెసిడెంట్ శివాజిరాజా. సూపర్ స్టార్ మహేష్ కూడా మా కు ఏ సపోర్ట్ కావాలన్నా ఇస్తా అన్నారట.
ఇక హీరోయిన్స్ ఈవెంట్ లకు అటెండ్ అవ్వాల్సిందే అంటున్నారు మా సభ్యులు. బయట ఫంక్షన్స్ లో వెళ్తే ఇచ్చే రెమ్యునరేషన్ కన్నా కాస్త తక్కువ ఇచ్చినా.. మా ఈవెంట్ కు రావడం అనేది అందరి బాధ్యత అని అన్నారు. కాదు కూడదు అని ఎవరైనా తోక జాడిస్తే మాత్రం కత్తిరించేస్తాం అంటున్నారు. ఒకరిద్దరు హీరోయిన్స్ పర్వాలేదు కాని మిగతా వారు తమ తప్పు మేనేజర్ల మీద వేస్తున్నారని అన్నారు. అలాంటి వారు ఇండస్ట్రీకి కూడా అవసరం లేదని మండిపడ్డారు. మొత్తానికి హీరోల నుండి మాకు ఫుల్ సపోర్ట్ రాగా.. హీరోయిన్స్ విషయంలో ఈసారి వెనక్కి తగ్గేది లేదన్నట్టు తెలుస్తుంది.