మహేష్, బన్ని ఈ ట్విస్ట్ ఊహాతీతం..!

అనూహ్యంగా ఈసారి బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్టార్ మహేష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలు ఫైట్ చేస్తున్నాయి. మహేష్ భరత్ అనే నేను, బన్ని నా పేరు సూర్యలు ఒకేరోజు రిలీజ్ అవుతున్నాయి. మొదట ఏప్రిల్ 27న అనుకున్న ఈ రెండు సినిమాలు ఒకటి ముందుకు మరోటి వెనక్కి వెళ్తాయని ఊహించారు. కాని దర్శక నిర్మాతల చర్చలు విఫలం కావడంతో మహేష్, బన్ని ఫైట్ షురూ అవుతుంది. 

ఇక ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే ముందు అనుకున్న ఏప్రిల్ 27న కాకుండా ఓ రోజు ముందుకు వస్తున్నారు. ఏప్రిల్ 26న మహేష్ భరత్ అనే నేను రిలీజ్ అని తెలుస్తుండగా.. అల్లు అర్జున్ నా పేరు సూర్య కూడా ఏప్రిల్ 26నే ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా చూస్తున్నారట. ఏప్రిల్ 27న సూపర్ స్టార్ రజినికాంత్ కాలా సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమాకు పోటీ ఇవ్వడం ఏమో కాని మహేష్, బన్నిల ఫైట్ రసవత్తరంగా మారింది.