ప్రియదర్శి తన ప్రేమను పరిచయం చేశాడు..!

పెళ్లిచూపులు సినిమాతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి ఈమధ్యనే వచ్చిన తొలిప్రేమ సినిమాలో కూడా మంచి రోల్ ప్లే చేశాడు. ప్రస్తుతం ఉన్న కమెడియన్స్ లో అతి తక్కువ టైంలో తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీ ఏర్పరచుకున్న ప్రియదర్శి ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఓ రోజు ముందే తన ప్రేమను పరిచయం చేశాడు. 

తను ప్రేమించిన రిచా బర్త్ డే సందర్భంగా నిన్న ప్రియదర్శి ఆమెకు పుట్టినరోజు శూభాకాంక్షలతో పాటుగా ఓ మెసేజ్ కూడా పెట్టాడు. మనసులోని భావాలన్నిటిని ఏర్చి కూర్చి మెసేజ్ పెట్టాడు. దాన్ని తన సోషల్ బ్లాగ్ లో ఉంచాడు. ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రియదర్శి చేసిన ఈ మెసేజ్ ట్రెండింగ్ లో ఉంది. అంతేకాదు రిచాతో తను దిగిన పిక్ ను షేర్ చేశాడు ఈ క్రేజీ కమెడియన్.