రామలక్ష్మిగా సమంత.. సింప్లీ సూపర్..!

రాం చరణ్, సమంత జంటగా నటిస్తున్న సినిమా రంగస్థలం. సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. ఇప్పుడు ఈ సినిమా నుండి వచ్చిన రామలక్ష్మి టీజర్ అదేనండి సమంత టీజర్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. చిట్టిబాబు ప్రేమికురాలిగా రామలక్ష్మి లుక్ అదిరిపోయింది. హాఫ్ సారీస్ లో సమంత రామలక్ష్మి లుక్ సినిమాకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. చిట్టిబాబు సౌండ్ ఇంజీరింగ్ గా కనిపిస్తుండగా.. సమంత ఈ సినిమాలో మూగ అమ్మాయిగా కనిపిస్తుందని అంటున్నారు. మొత్తానికి సమంత రామలక్ష్మి లుక్ తో సినిమాపై అంచనాలు పెంచడమే కాదు ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూసేద్దామా అన్న ఎక్సైట్మెంట్ ఎక్కువ చేశారు.