మెహబూబా టీజర్ అదుర్స్..!

పూరి జగన్నాథ్ డైరక్షన్ లో తనయుడు ఆకాష్ హీరోగా చేస్తూ వస్తున్న సినిమా మెహబూబా. ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో అప్పటి ప్రేమకథగా ఈ సినిమా రాబోతుంది. ఇండియా, పాకిస్థాన్ కు చెందిన అమ్మాయి, అబ్బాయిలు ఎలా వారి ప్రేమను దక్కించుకున్నారు అన్నది సినిమా కథ. అయితే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు పూరి. ఓ విధంగా చెప్పాలంటే మెహబూబాతో పూరి కం బ్యాక్ మూవీ అవుతుందని అనిపిస్తుంది.

టేకింగ్ పరంగా తనకు తానే సాటి అనేలా మెహబూబా టీజర్ అదరగొట్టాడు. టీజర్ స్టార్టింగ్ లోనే ఇండియా, పాక్ బోర్డర్ గేట్స్ తెరచుకోవడం చూస్తే కచ్చితంగా సినిమా ఓ సంచలనం సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఇక హీరోగా ఆకాష్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు. నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ అయితే ప్రామిసింగ్ గా ఉంది. సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాతో పూరి ఈసారి గట్టిగానే కొట్టేలా ఉన్నాడు.