
రీసెంట్ గా భాగమతి సక్సెస్ తో తన సత్తా ఏంతో మరోసారి ప్రూవ్ చేసిన స్వీటీ అనుష్క మీడియా ముందు తన మ్యారేజ్ ప్రపోజల్స్ గురించి చెబుతుంది. ఇప్పటిదాకా ఇంకా తనకు నచ్చినవాడు దొరకలేదని చెబుతున్న అనుష్క పెళ్లి కేవలం పిల్లల కోసమే అంటుంది. తనకు చిన్నపిల్లలంటే ఇష్టమని వారి కోసమైనా తప్పకుండా పెళ్లిచేసుకుంటా అని అంటుంది అమ్మడు.
ఇక ప్రభాస్ తో తనకు లింక్ పెడుతూ వస్తున్న వార్తలకు మళ్లీ ఆమె మేమిద్దరం కేవలం స్నేహితులమే.. మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదని అన్నది. భాగమతితో సూపర్ సక్సెస్ అందుకున్న అనుష్క తర్వాత సినిమాలపై క్లారిటీ రాలేదు. అసలైతే కోలీవుడ్ డైరక్టర్ గౌతం మీనన్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తుందని అన్నారు. కాని ఆ విషయాల గురించి అమ్మడు నోరు విప్పలేదు.