
టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ వి.వి. వినాయక్ పొలిటికల్ ఎంట్రీకి టైం వచ్చిందా అంటే అవుననే అంటున్నాయి సిని వర్గాలు. ఎన్నాళ్ల నుండో రాజకీయాల్లోకి వస్తున్నా అంటూ ఊరించిన వినాయక్ 2019 ఎన్నికల్లో తప్పకుండా రాజకీయ ప్రవేశం చేస్తాడని అంటున్నారు. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన వినాయక్ ఆ వారసత్వాన్ని కొనసాగించేలా పాలిటిక్స్ లో రాణించాలని చూస్తున్నారు.
అయితే వినాయక్ ఏ పార్టీలో చేరతాడు అన్న విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదు. టిడిపి, వైసిపి ఈ రెండిటిలో ఏదో ఒక పార్టీలో వినాయక్ చేరే అవకాశాలు ఉన్నాయట. మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తో ఇంటిలిజెంట్ సినిమా చేసిన వినాయక్ తన తర్వాత సినిమాల విషయంలో ఇంకా క్లారిటీకి రాలేదు. ఇంటిలిజెంట్ ప్రమోషన్స్ లో భాగంగా తన పొలిటికల్ ఎంట్రీపై మాట్లాడుతూ దర్శకుడిని అవుతానని అనుకోలేదు అయ్యాను.. రాజకీయాల్లోకి వెళ్తానా లేదా అన్నది కూడా తెలియదని అన్నారు. వినాయక్ మాటలు చూస్తుంటే తప్పకుండా రాజకీయాల్లోకి వచ్చేలా ఉన్నట్టు అనిపిస్తుంది.