
సూపర్ స్టార్ రజిని, శంకర్ కాంబోలో వస్తున్న సినిమా 2.ఓ. రోబో సీక్వల్ గా వస్తున్న ఈ సినిమా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో 450 కోట్ల భారీ బడ్జెట్ తో రాబోతుంది. ఇప్పటికే చాలా సార్లు రిలీజ్ వయిదా పడిన ఈ సినిమా ఫైనల్ గా ఏప్రిల్ 14న వస్తుందని రజినినే అన్నారు. కాని పరిస్థితి చూస్తుంటే సినిమా మళ్లీ వాయిదా పడినట్టే అనిపిస్తుంది. గ్రాఫిక్స్ కు సంబందించిన పని ఇంకా పూర్తి కాలేదట.
సినిమా రిలీజ్ మాట అటుంచితే ఇప్పటివరకు సినిమా టీజర్ ను కూడా వదల్లేదు. అందుకే 2.ఓ ని వెనక్కి నెట్టేసి కాలా ముందుకొచ్చాడని అంటున్నారు. కబాలి డైరక్టర్ తీస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. రజిని డాన్ గా కనిపిస్తున్న ఈ సినిమా 2.ఓ అనుకున్న డేట్ కు రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను ధనుష్ నిర్మిస్తుండటం విశేషం.