
మలయాళ ప్రేమం తో సౌత్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ అయిన సాయి పల్లవి ఆ తర్వాత తెలుగులో చేసిన ఫిదాతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. ఫిదా సూపర్ హిట్ తర్వాత నాని ఎం.సి.ఏ కూడా హిట్ అవడంతో అమ్మడిది లక్కీ హ్యాండ్ అయ్యింది. ఇక బ్యాక్ టూ బ్యాక్ హిట్లు కొడితే ఏ హీరోయిన్ అయినా డిమాండ్ ను బట్టి రెమ్యునరేషన్ అడగడం కామనే. అలానే ప్రస్తుతం నటిస్తున్న శర్వానంద్ సినిమాకు ఈ ఫిదా భామ కోటి పాతిక లక్షకు చార్జ్ చేస్తుందట.
కోటి దాటింది అంటే ఇక స్టార్ హీరోయిన్ అయినట్టే. ఇక శర్వానంద్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ కాబట్టి సినిమాకు ఆమె అదనపు ఆకర్షణగా నిలుస్తుందని తీసుకున్నారు. హను రాఘవపుడి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు పడి పడి లచే వయసు అనే టైటిల్ అనుకుంటున్నారట. తెలుగులో హీరోయిన్స్ క్రేజ్ సంపాదిస్తే వారు ఎంత డిమాండ్ చేస్తే అంతా ఇచ్చేస్తారు నిర్మాతలు. కేవలం 3వ సినిమాతోనే కోటి దాటేసిన సాయి పల్లవి మిగతా హీరోయిన్స్ కు షాక్ ఇచ్చిందని చెప్పాలి.