
టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందనే చెప్పాలి. లాస్ట్ ఇయర్ టాలీవుడ్ లో చేసిన జయ జానకి నాయకా, స్పైడర్ సినిమాలు రెండు నిరాశ పరచే సరికి అమ్మడికి అవకాశాలు లేకుండా పోయాయి. ఇక వచ్చిన స్టార్ సినిమాలను కాదనేసిన అమ్మడు మాక్సిం కవర్ పేజ్ కు గ్లామరసాన్ని పండించేసింది. ఇన్నాళ్లు అందాల ప్రదర్శనకు బిడియ పడినట్టు కనిపించిన రకుల్ ఇప్పుడు ఆ అడ్డుగోడలన్ని ఎత్తేసినట్టు కనిపిస్తుంది.
గ్లామర్ డోస్ పెంచి అమ్మడు ఇచ్చిన ఈ బికిని స్టిల్.. మాక్సిం కవర్ పేజ్ కే కొత్త కలరింగ్ తెచ్చిందని చెప్పాలి. బాలీవుడ్ లో అయ్యారి సినిమా చేసిన రకుల్ ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అక్కడ మీడియాకు హాట్ ఫోటో షూట్స్ ఇచ్చేస్తుంది. గ్లామర్ గేట్లు ఎత్తేస్తూ అమ్మడు చేస్తున్న ఈ హాట్ పిక్ కుర్రాళ్ల హృదయాలను గాయపరచిందనే చెప్పాలి.
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో లైం లైట్ లోకి వచ్చిన అమ్మడు స్టార్ అవకాశాలతో సూపర్ ఇమేజ్ సంపాదించింది. కోలీవుడ్ లో ప్రస్తుతం ఫాం కొనసాగిస్తున్న అమ్మడు చూస్తుంటే ఎలాంటి సినిమాకైనా సిద్ధమే అన్న సిగ్నల్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.