
యువ హీరో నాగ శౌర్య మొత్తానికి తన ఖాతాలో క్రేజీ హిట్ వేసుకున్నాడు. వెంకీ కుడుముల డైరక్షన్ లో ఛలో అండ్ లాస్ట్ ఫ్రైడే ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగ శౌర్య సినిమా హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు. సినిమా హీరోగానే కాదు నిర్మాణ బాధ్యతలను మీద వేసుకున్న శౌర్య ఈ హిట్ తో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.
6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ కు మరో 3 కోట్లు ఖర్చు చేయా ఫైనల్ గా 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజ్ అయ్యింది. అయితే రిలీజ్ అయిన వారాంతరంలోనే ఈ సినిమా 5 కోట్ల పైన షేర్ వాల్యూస్ కలెట్ చేసిందట. ఇక యూఎస్ లో ఈ సినిమా ఊహించని వసూళ్లను రాబడుతుందని తెలుస్తుంది. అక్కడ ఏమాత్రం మార్కెట్ లోని నాగశౌర్య ఛలో సినిమాతో హాఫ్ మిలియన్ క్రాస్ చేశాడని తెలుస్తుంది.
రష్మిక మందన నటన సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవగా.. సాగర్ మహతి మ్యూజిక్ ఛలోకి ప్రాణంగా నిలిచింది. కెరియర్ అటు ఇటుగా ఉన్న ఈ టైంలో పర్ఫెక్ట్ హిట్ అందుకున్న నాగ శౌర్య కచ్చితంగా మళ్లీ ట్రాక్ ఎక్కేశాడని చెప్పొచ్చు.