
అదేంటి ఎప్పుడో ఏప్రిల్ లో రిలీజ్ అవబోతున్న సినిమాకు ఇప్పుడు నష్టాలు రావడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా నా పేరు సూర్య. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు నాగబాబు కో ప్రొడ్యూసర్ గా ఉంటున్నారు. అయితే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అమ్మేశారు. టీజర్ రిలీజ్ కు ముందే నా పేరు సూర్యను ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్ 12 కోట్లకు కొనేశారు.
ఇక టీజర్ కు భారీ రెస్పాన్స్ రావడంతో ఆ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం మిగతా ఛానెళ్లు భారీ ఆఫర్లు ఇచ్చారట. దాదాపు 18 కోట్లైనా పెట్టి ఆ సినిమా కొనేద్దామని వచ్చారట. అప్పటికే శాటిలైట్ బిజినెస్ క్లోజ్ అయ్యిందని తెలిసి షాక్ అయ్యారట. 18 కోట్లకు వెళ్లాల్సిన శాటిలైట్స్ ను 12 కోట్లకు అమ్మేశారు.
అంటే ఎలా లేదన్న సినిమా నిర్మాతకు 5 నుండి 6 కోట్ల దాకా లాస్ అన్నట్టే. బన్ని సోల్జర్ గా కనిపిస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్స్ విశాల్ శేఖర్ ద్వయం మ్యూజిక్ అందిస్తున్నారు. అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 27న రిలీజ్ అంటున్నారు.