
టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కు కష్టాలు వచ్చాయా అంటే కచ్చితంగా అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో లైం లైట్ లోకి వచ్చిన ఈ అమ్మడు బ్రూస్ లీతో చరణ్ తో కలిసి నటించి ఆ తర్వాత వరుస స్టార్స్ అవకాశాలను అందుకుంది. చరణ్, ఎన్.టి.ఆర్, మహేష్ ఇలా స్టార్స్ అందరితో కలిసి నటించిన ఈ అమ్మడికి ఈ ఇయర్ ఇప్పటికి ఒక్క సినిమా కూడా లేకపోవడం విశేషం.
స్పైడర్ నిరాశ పరచడంతో ఆమె తెలుగు సినిమాల మీద ముఖ్యంగా స్టార్ సినిమాల మీద అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదట. రీసెంట్ గా ఓ రెండు స్టార్ సినిమాల్లో అవకాశం వచ్చినా కాదని చెప్పేసిందట. మరి అమ్మడు అనుష్కలా లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలని నిర్ణయించుకుందో ఏమో కాని ప్రస్తుతం తెలుగులో ఆమె చేతిలో సినిమా లేకపోయే సరికి ఇక్కడ సర్దేసిందనే అంటున్నారు. బాలీవుడ్ మూవీ అయ్యారితో లక్ టెస్ట్ చేసుకోనున్న రకుల్.. కోలీవుడ్ లో మాత్రం వరుస అవకాశాలను అందుకుంటుందట.