పవన్ గురించి కలక్షన్ కింగ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాలు వదిలి రాజకీయాల మీద దృష్టి పెట్టాడు. 2019 ఎన్నికల్లో జనసేన తెలుగు రెండు రాష్ట్రాల్లో పోటీ పడుతుంది. ఇక దీనికి సంబందించిన ప్రచారం మొదలు పెట్టాడు పవన్. ఈ పరిస్థితుల్లో పవన్ గురించి కొందరు పాజిటివ్ గా.. మరికొందరు నెగటివ్ గా స్పందిస్తున్నారు. అంతేకాదు పవన్ గురించి తటస్థంగా ఉన్న వారు ఉన్నారు. 

ఇక రీసెంట్ గా పవన్ పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడేందుకు నిరాకరించాడు కలక్షన్ కింగ్ మోహన్ బాబు. తను నటించిన గాయత్రి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూల్లో పాల్గొన్న మోహన్ బాబు పవన్ జనసేనపై నో కామెంట్ అనేస్తున్నాడు. అయితే చిరుకి తనకు మధ్య ఏదో ఉన్నదన్న వార్తలు వచ్చిన టైంలో చిరంజీవికి పద్మ భూషణ్ వచ్చిన సందర్భంలో జరిగిన కార్యక్రమంలో 'తమ్ముడూ మోహన్ బాబు' అంటూ పవన్ సంభోదించడం జరిగింది. అప్పుడది సరదాగా అనిపించి వదిలేశా.. ఆ తర్వాత ఆలోచిస్తే అర్ధమైందని.. అలా తనని ఎందుకు పవన్ అన్నాడో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా అని అన్నారు మోహన్ బాబు.    

ఇక గాయత్రి సినిమా మదన్ డైరక్షన్ చేయగా.. మోహన్ బాబు స్వయంగా నిర్మించారు. మంచు విష్ణు, శ్రీయాలు కూడా ఇందులో నటించడం జరిగింది. ఈ శుక్రవారం మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ ఇంటిలిజెంట్ కు పోటీగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది.