
బ్రహ్మోత్సవం, స్పైడర్ తర్వాత కొడితే హిట్ కొట్టాలన్న ఆలోచనతో మహేష్ ప్రస్తుతం చేస్తున్న భరత్ అనే నేను సినిమా మీద పూర్తి దృష్టి పెట్టాడు. కచ్చితమైన హిట్ టార్గెట్ తో సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి సినిమా చేయనున్న మహేష్ బోయపాటి శ్రీనుకు షాక్ ఇచ్చాడట. అదెలా అంటే మహేష్ ఇమేజ్ కు సరిపోయే లైన్ తో కలిసి బోయపాటికి సారీ అని చెప్పేశాడట మహేష్.
స్టోరీ లైన్ రొటీన్ గా అనిపించిందట. అందుకే బోయపాటికి మొహమాటం లేకుండా నచ్చలేదని చెప్పేశాడట. బోయపాటి బ్రాండ్ ఇమేజ్ తో ఎలాంటి కథ అయినా నడిచిపోద్ది. అయితే మహేష్, బోయపాటి సినిమా అంటే ఆ అంచనాలు వేరేలా ఉంటాయి. అందుకే కథ ఆ అంచనాలకు తగినట్టు లేదని మహేష్ కాదన్నాడట. ప్రస్తుతం ఈ కథ వద్దని చెప్పిన మహేష్ మరేదైనా కథతో రమ్మని చెప్పాడట.
భరత్ అనే నేను సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కాబోతుంది. ఫస్ట్ ఓత్ తో ఫ్యాన్స్ ను అలరించిన మహేష్ సినిమాపై పూర్తి నమ్మకంగా ఉన్నాడట. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.