వెంకటేష్ ను టచ్ చేయలేదు..!

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా విక్రం సిరి డైరక్షన్ లో వచ్చిన సినిమా టచ్ చేసి చూడు. లాస్ట్ ఫ్రై డే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేయడంలో విఫలమైంది. అయితే ఈ సినిమా కథ రవితేజకు చెప్పడానికి ముందే వెంకటేష్ కు చెప్పాడట డైరక్టర్ విక్రం సిరి. వెంకటేష్ కు డైరెక్ట్ గా కాకుండా సురేష్ బాబే ఈ కథ విని సారీ రొటీన్ కథ అనేశాడట.

అనుకున్నట్టుగానే సినిమా రిలీజ్ అవడం రొటీన్ కొట్టుడన్న కామెంట్లు రావడం జరిగింది. వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమా డైరక్షన్ పరంగా కూడా విక్రం సిరి అంచనాలను అందుకోలేదని అంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇతనో కాబోయే స్టార్ డైరక్టర్ అన్న రేంజ్ లో బిల్డప్ ఇవ్వగా నిజంగానే విక్రం సిరికొండ ఇరగదీస్తాడని అనుకున్నారు. కాని సినిమా చూస్తే కనీసం ఇంప్రెస్ చేయాల్సిన సన్నివేశాలను కూడా సరిగా హ్యాండిల్ చేయలేదని అనిపించింది.

మొత్తానికి వెంకటేష్ ఈ సినిమా కాదని మంచి పనే చేశాడని విషయం తెలిసిన వారు అంటున్నారు. మిస్సైన సినిమా హిట్ అయితే అర్రే అనుకోవచ్చేమో కాని ఫ్లాప్ అయితే మాత్రం తమ డెశిషన్ కరెక్ట్ అంటూ కాస్త కాన్ ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.