మెగా హీరోలతో బన్ని.. ఈ ఫైటింగ్ దేనికోసం..!

మెగా ఫ్యామిలీ నుండి హీరోలంతా టాలీవుడ్ రంగప్రవేశం చేయడంతో ఒక హీరో సినిమా మరో హీరోకి పోటీగా మారుతుంది. ఈ శుక్రవారం వరుణ్ తేజ్ తొలిప్రేమ, సాయి ధరం తేజ్ ఇంటిలిజెంట్ రెండు ఒక్కరోజు తేడాతో రాబోతున్నాయి. అయితే ఈ మెగా ఫైట్ హీరోల అభిమానుల మధ్య చీలిక ఏర్పడేలా చేస్తుంది. ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసారి వస్తే మెగా అభిమానుల్లో చీలిక తప్పనిసరి. 

ఈసారికి ఓకే కాని ఇక నుండి ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేలా మెగా ఫైట్ పై స్టైలిష్ స్టార్ మెగా హీరోలతో ఓ ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాడట. రిలీజ్ డేట్ క్లాష్ కాకుండా ముందు నుండే జాగ్రత్తపడాలని దానికి సంబందించిన తగిన చర్యలు తీసుకోవాలని డిస్కస్ చేస్తారట. మొత్తానికి మెగా హీరోలందరు ఈ నిర్ణయానికి రావడం మంచి తరుణమే అని చెప్పాలి. 

అయితే ఈ ఫైట్ వరుణ్, సాయి ధరం తేజ్ ల మధ్య అయ్యింది కాబట్టి ఓకే కాని.. అదే బన్ని, చెర్రిల మధ్య అయితే కచ్చితంగా మెగా అభిమానుల్లే అసంతృప్తి వచ్చేది. బన్ని చేస్తున్న ఈ ప్రయత్నం మెగా హీరోలందరి ఆమోదయోగ్యమే అని చెప్పుకోవాలి.