
కోలీవుడ్ విక్రం క్రేజ్ ను రెండింతలు చేసిన సినిమా సామి. హరి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో త్రిషా హీరోయిన్ గా నటించింది. 2003లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అవగా ఆ సినిమాకు సీక్వల్ గా ఇప్పుడు ఈ సినిమా రాబోతుంది. ఇక ఈ సీక్వల్ లో విక్రం హీరోగా నటిస్తుండగా త్రిషా ఒక హీరోయిన్ ఆమెతో పాటు కీర్తి సురేష్ కూడా మరో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.
అయితే అనుకోకుండా ఈ సినిమా నుండి త్రిషా ఎగ్జిట్ అయ్యిందట. కీర్తి సురేష్ కారణంగానే త్రిష ఆ సినిమా నుండి బయటకు వచ్చిందన్న కామెంట్లి వినిపిస్తున్నాయి. కోలీవుడ్ లో హాట్ న్యూస్ గా నిలిచిన ఈ వార్తలపై కీర్తి స్పందించింది. తనకు త్రిషాకు కాంబినేషన్ సీన్స్ లేవని.. మరి తను సినిమా ఎక్సిట్ అవడానికి తాను కారణం ఎలా అవుతానని అంటుంది కీర్తి.
ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని. తన మీద వస్తున్న రూమర్స్ అన్నిటికి చెక్ పెట్టేసింది కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో మహానటి సినిమాలో నటిస్తుంది.