రజిని ఫోన్ తో భాగమతి షాక్..!

అనుష్క ప్రధాన పాత్రలో పిల్ల జమిందార్ అశోక్ డైరక్షన్ లో వచ్చిన సినిమా భాగమతి. జనవరి 26న రిలీజ్ అయిన ఈ సినిమా 2017లో టాలీవుడ్ కు అదిరిపోయే హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్ లో అనుష్క పాత్రే ఎక్కువని చెప్పొచ్చు. అరుంధతి తర్వాత ఆ రేంజ్ లో తన ఫ్యాన్స్ ను అలరించింది స్వీటీ. ఇక సినిమాలో మ్యూజిక్, ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ కూడా ఈ రేంజ్ సక్సెస్ కు కారణమయ్యాయి.

ఇక ఈ సినిమా సక్సెస్ పట్ల టాలీవుడ్ సిని ప్రముఖులు తమ అభినందనలు తెలిపారు. ఈమధ్యనే చరణ్ సినిమా గురించి చెబుతూ సినిమా చూసిన రోజు రాత్రి ఉపాసన నిద్రపోలేదని అన్నాడు. అంతేకాదు చిత్రయూనిట్ ను ప్రశంసించాడు. ఇక ఇప్పుడు భాగమతి టీం ను సూపర్ స్టార్ రజినికాంత్ కూడా సర్ ప్రైజ్ చేశాడట. సినిమా చూసిన రజిని అనుష్కకు కాల్ చేసి మాట్లాడారట. రజినికాంత్ లింగ సినిమాలో అనుష్క నటించిన విషయం తెలిసిందే.