ఛలో హీరోయిన్.. కిర్రాక్ పుట్టించేసింది..!

యువ హీరో నాగ శౌర్య, రష్మిక మందన జంటగా నటించిన సినిమా ఛలో. వెంకీ కుడుముల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. సినిమాలో కథాబలం లేకున్నా దర్శకుడు కామెడీతో సినిమాను నడిపించిన తీరు ఆకట్టుకుంది. ఇక సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన అమ్మడు కన్నడ భామ రష్మిక మందన. కిర్రిక్ పార్టీ అంటూ అక్కడ హిట్ అందుకుని ఓవర్ నైట్ స్టార్ డం తెచ్చుకున్న ఈ అమ్మడు ఛలోలో కూడా తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.

క్యూట్ లుక్స్ తో అమ్మడు తెలుగు ప్రేక్షకులకు నచ్చేసిందని చెప్పొచ్చు. సినిమాలో హీరోయిన్ ఉంది అంటే ఉంది అనుకుంటున్న ఈరోజుల్లో అభినయానికి స్కోప్ ఉన్నంతలో తమ టాలెంట్ చూపించేయాలి. ఆ విషయంలో ఛలో భామ రష్మిక మంచి మార్కులే కొట్టేసింది. మొదటి సినిమా హిట్ అయితే తెలుగులో ఇక తిరుగే ఉండదు. డెబ్యూ మూవీతో దుమ్మురేపుతున్న రష్మికకు క్రేజీ ఆఫర్స్ వస్తాయనడంలో సందేహం లేదు.