
బుల్లితెర, వెండితెర నటుడు రాజీవ్ కనకాల ఇంట విషాదం చోటు చేసుకుంది. రాజీవ్ కనకాల తల్లి లక్ష్మి దేవి ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్న లక్ష్మి దేవి ఈరోజు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. 11 ఏళ్ల వయసులోనే నాటకరంగంలో అడుగుపెట్టిన లక్ష్మి దేవి దేవదాస్ కనకాలతో పెళ్లి తర్వాత సొంతంగా ఫిలిం ఇన్ స్ట్యూట్ పెట్టడం జరిగింది.
నటుడిగా ఫిలిం స్కూల్ అధినేతగా దేవదాస్ కనకాల, లక్ష్మి దేవిలకు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. అడపాదడపా సినిమాల్లో కూడా కనిపించి అలరించారు లక్ష్మి దేవి. పోలీస్ లాకప్ సినిమాలో విజయశాంతి అత్తగా.. కొబ్బరిబోండం సినిమాలో రాజేంద్ర ప్రసాద్ తల్లి పాత్రలో మెప్పించారు లక్ష్మి దేవి. ఇక ఇవే కాకుండా ప్రేమ బంధం, పోలీస్, ఒక ఊరి కథ సినిమాల్లో కూడా నటించారు లక్ష్మిదేవి. ఆమె మరణానికి మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ప్రగాడ సానుభూతిని తెలిపారు.