హీరో కాళ్లమొక్కుడు.. రివర్స్ గా వాళ్లు కూడా..!

అభిమానం మితిమీరితే ఎలా ఉంటుంది అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం ఆ తర్వాత అభిమాన హీరో అనేలా.. వారికి పెట్టినట్టే సాష్టాంగ నమస్కారం సినిమా హీరోలకు పెడుతున్నారు. దశాబ్ధాలుగా హీరోగా ఉండి అభిమాన హీరోనే దైవం అనుకున్న వీరాభిమానులు ఇలా చేస్తే ఓకే. అది కూడా హీరోలకు నచ్చదని తెలుస్తున్నా అంతవరకు ఓకే కాని పట్టుమని పది సినిమాలు కూడా తీయని హీరో కాళ్లమీద కూడా పడితే.. సేం టూ సేం ఇలానే జరిగింది మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ కు. ప్రస్తుతం తను నటించిన ఇంటిలిజెంట్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇస్తున్న ఇంటర్వ్యూల్లో ఒక ఇంటర్వ్యూ అతన్ని షాక్ అయ్యేలా చేసింది.


ఇంటర్వ్యూ సమయంలో తన అభిమానులు తేజ్ కళ్ల మీద పడిపోయారు. అయితే తేజ్ కూడా అదేవిధంగా రివర్స్ లో వాళ్లకి కాళ్లు మొక్కాడు. తనని అంత పెద్ద వాడిని చేయొద్ధంటూ దానితో పాటుగా తనకు ఇలాంటివి నచ్చవంటూ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు తేజ్. రీసెంట్ గా ఇలాంటి సందర్భమే సూర్య తానా సేంద్ర కూట్టం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగింది. సూర్య కూడా అభిమానులు కాళ్ల మీద పడితే రివర్స్ లో తాను వారి కాళ్లకు నమస్కారం చేశాడు. మొత్తానికి తెర మీదే కాదు తెర వెనుక హీరోలవుతున్నారు హీరోలు.