
మెగా హీరోలు వరుసగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడంతో ఒక హీరో సినిమాకు మరో హీరో సినిమా అడ్డు వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతం ఫిబ్రవరి 9న ఇలాంటి క్లాష్ జరుగుతుంది. వరుణ్ తేజ్ తొలిప్రేమ, సాయి ధరం తేజ్ ఇంటిలిజెంట్ ఈ రెండు సినిమాలు ఒకేరోజున వస్తున్నాయి. అయితే రెండు ప్రొడక్షన్స్ మాత్రం ఈ ఇద్దరు ఒకేసారి వచ్చినా వారి వారి ఇండివిడ్యువల్ ఫాలోయింగ్ ను బట్టి ఆడేస్తాయని నమ్మకంతో ఉన్నారు.
అయితే ఈ రెండు సినిమాల క్లాష్ పై మెగాస్టార్ కాస్త సీరియస్ గా ఉన్నారని ఇన్నర్ టాక్. మన సినిమా మనకే పోటీ వస్తే ఎలా అన్న ఆలోచనతో ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ గా జరగాలని చెప్పారట. ఇక ఫైనల్ గా వరుణ్ తేజ్ తొలిప్రేమ ఒకరోజు వాయిదా వేసుకుని ఫిబ్రవరి 10న రిలీజ్ ఫిక్స్ చేశారు. మొత్తానికి ఒకేరోజు మెగా ఫైట్ కు మెగాస్టార్ వార్నింగ్ పనిచేసిందని చెప్పాలి.