అజ్ఞాతవాసి బయ్యర్లకు అభయహస్తం..!

పవన్ కళ్యాణ్ త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరచిన సంగతి తెలిసిందే. సంక్రాంతి రాజుగా నిలుస్తుంది అనుకున్న సినిమా కలక్షన్స్ లో కూడా చిన్నబోయింది. ఇక ఈ సినిమా లాసులకు బయ్యర్లు నిర్మాత దగ్గరకు వచ్చారట. తన ఫ్లాపుకు బాధ్యతగా ప్రస్తుతం తానేమి రిటర్న్ ఇవ్వలేనని పవన్ కళ్యాణ్ చెప్పేశాడని అంటున్నారు. 

ఇక ఈ అపజయ భారమంతా తన మీదే వేసుకుని నిర్మాతగ రాధాకృష్ణనే సినిమా బయ్యర్లకు 19% రిటర్న్ ఇస్తున్నాడట. 110 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన ఈ సినిమా 25 కోట్ల దాకా బయ్యర్లు రిటర్న్ ఇస్తున్నాడట. అంతేకాదు తమ ప్రొడక్షన్ లో రాబోయే తర్వాత సినిమాను వారికే ఇచ్చే ఒప్పందం ఏర్పరచుకున్నారట. మొత్తానికి అజ్ఞాతవాసి బయ్యర్లకు నిర్మాత అభయహస్తం ఇచ్చాడని తెలుస్తుంది.