ఛలో శౌర్య ఏంటయ్యా ఇది..!

యువ హీరోల్లో డిఫరెంట్ సినిమాలు చేస్తూ లవర్ బోయ్ ఇమేజ్ తెచ్చుకున్న సినిమా నాగశౌర్య. ప్రస్తుతం ఛలో అంటూ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నాగశౌర్య ప్రవర్తనతో స్టార్ హీరోల అభిమానులు కోపంగా ఉన్నారు. అలా ఎందుకు అంటే.. అప్పట్లో ఎన్.టి.ఆర్ తన అభిమాన నటుడు ఆయనలో ఉండే ఎనర్జీ ఎవరిలో ఉండదని చెప్పిన నాగశౌర్య ఛలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవిని పొగుడుతూ నెంబర్ 1 కుర్చి ఆయనదే అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. 

అయితే నాగశౌర్య కామెంట్స్ కు రివర్స్ పంచ్ వేస్తున్నారు నెటిజెన్లు. సినిమా ప్రమోషన్స్ కోసం చిరుని వాడుకుంటూ ఆయన డబ్బా కొడుతున్న నాగశౌర్య మరి ఎన్.టి.ఆర్ ను ఎందుకు ఫేవరేట్ హీరో అన్నాడని విమర్శలు చేస్తున్నారు. సినిమా ప్రేక్షకుల్లో వేళ్లేలా చేయడంలో సక్సెస్ అయిన నాగశౌర్య ఛలోపై అనుకున్న దాని కన్నా మంచి బక్ ఏర్పడేలా చేసుకున్నాడు. మరి ఈ కామెంట్స్ సినిమా ప్రమోషన్స్ కు ఉపయోగపడగా సినిమా ఫలితం మీద ఏమాత్రం ప్రభావం చూపుతాయో చూడాలి.