హీరోయిన్ కు లైంగిక వేధింపులు

స్కూళ్ళు, కాలేజీలకు వెళ్ళే విద్యార్ధినులకు, ఉద్యోగాలు చేసే మహిళలకు లైంగిక వేధింపులకు గురవుతున్నారనే వార్తలు నిత్యం వింటూనే ఉన్నాము. అలాగే సినీపరిశ్రమలో వర్ధమాన, ప్రముఖ సినీ హీరోయిన్లకు కూడా ఈ లైంగిక వేధింపులు తప్పడం లేదు. సినీపరిశ్రమలో అంతర్గతంగా వేధింపులే కాకుండా బయటివ్యక్తులు కూడా వారిని వేధిస్తుంటారని నిరూపించే ఘటన ఒకటి జరిగింది. ప్రముఖ నటి అమలాపాల్ ను తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్త అలగేశన్ గత కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాదు. ఈ విషయం ఆమె స్వయంగా నిన్న చెన్నై పాండిబజార్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినప్పుడు అందరికీ తెలిసింది. తనవంటి సెలబ్రెటీకే భద్రత లేనప్పుడు, సమాజంలో సాధారణ మహిళల పరిస్థితి ఏవిధంగా ఉందో ఊహించుకోవడం కష్టమని అమలాపాల్ అన్నారు. ఆమె పిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని అలగేశన్ ను నిన్న అదుపులోకి తీసుకొన్నారు.