నాని అ! రిలీజ్ ఎప్పుడంటే..!

హీరోగా వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని నిర్మాతగా తెరకెక్కిస్తున్న సినిమా అ!. ప్రశాంత్ వర్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కాజల్, నిత్యా మీనన్, రెజినా, ఈషా, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి నటించారు. ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో నాని క్లారిటీ ఇచ్చాడు. ఫిబ్రవరి 16న ఈ సినిమా రిలీజ్ కానుందని అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు.

సినిమాలో నాని చేపగా.. రవితేజ మొక్కగా కనిపిస్తారట. కచ్చితంగా నిర్మాతగా నానికి ఈ సినిమా గొప్ప పేరు తెచ్చిపెడుతుందని అంటున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ఇంప్రెస్ చేసిన ఈ సినిమా టీజర్ కూడా ఆకట్టుకుంది. మరి సినిమా అందరి ఆశ్చర్యపడేలా చేస్తుందా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఫిబ్రవరి 16 దాకా ఆగాల్సిందే. ప్రస్తుతం నాని హీరోగా కృష్ణార్జున యుద్ధం చేస్తున్నాడు. మేర్లపాక గాంధి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ ఎనౌన్స్ చేశారు.