చరణ్ తో జగన్.. రిస్కేమో బాసు..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని లేటెస్ట్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా చిరుతతో ఎంట్రీ ఇచ్చిన చరణ్ ఆ తర్వాత వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. ధ్రువ హిట్ తర్వాత రంగస్థలం సినిమా చేస్తున్న చరణ్ ఆ సినిమా తర్వాత బోయపాటి సినిమా లైన్ లో పెట్టాడు. ఇక ఇదే కాకుండా రాజమౌళి సినిమా కూడా అక్టోబర్ నుండి మొదలవనుంది.

ఈ రెండు సినిమాల తర్వాత చరణ్ పూరితో సినిమా చేస్తాడని టాక్. టెంపర్ తర్వాత వరుస ఫ్లాపులను తీస్తున్న పూరి జగన్నాధ్ ప్రస్తుతం తనయుడు ఆకాష్ హీరోగా మెహబూబా సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత చరణ్ కు లైన్ వినిపించాడట. చరణ్ ఓకే అన్నట్టు టాక్. అయితే ఈ టైంలో పూరితో చరణ్ సినిమా చేయడం పట్ల మెగా ఫ్యాన్స్ డౌట్ పడుతున్నారు. ఎలా లేదన్నా 2019 జూన్ తర్వాతే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.