సమంత పొలిటికల్ ఎంట్రీ.. వాట్ ఏ న్యూస్..!

సౌత్ సూపర్ హీరోయిన్ సమంత రాజకీయాల్లోకి రానుందా.. సికిందరాబాద్ నుండి ఆమె పోటీ చేయనుందా అంటే ప్రస్తుతం మీడియా సృష్టిస్తున్న వార్తలను బట్టి చూస్తే అదే నిజమనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణా రాష్ట్ర చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సమంత ఇప్పుడు సికిందరాబాద్ అసెంబ్లీ నుండి పోటీ చేయనుందని టాక్. అయితే ఇది కావాలని ఎవరో కల్పించిన వార్తే అని తెలుస్తుంది. 

ఈమధ్యనే అక్కినేని కోడలుగా అడుగుపెట్టిన సమంత పొలిటికల్ ఎంట్రీ పై వస్తున్న వార్తలను అక్కినేని క్యాంప్ కొట్టి పడేసింది. ఇప్పటివరకు అక్కినేని ఫ్యామిలీ నుండి ఎవరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. మరి అలాంటిది సమంత ఎలా వస్తుందని అంటున్నారు. కొన్నాళ్లు హీరోయిన్ గా సెలెక్టివ్ సినిమాలు చేసి ఆ తర్వాత డైరక్టర్ లేక నిర్మాతగా కెరియర్ కొనసాగించాలని చూస్తుంది సమంత.