బన్ని డిజె యూట్యూబ్ రికార్డ్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన సినిమా దువ్వాడ జగాన్నాధం. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ టాక్ తో వచ్చినా కలక్షన్స్ దుమ్మురేపింది. బన్ని కెరియర్ లో హిట్ సినిమాగా నిలిచిన ఈ డిజె హింది వర్షన్ లో రికార్డ్ సృష్టించింది. అది కూడా ఎక్కడో కాదు యూట్యూబ్ లో బన్ని డిజె 100 మిలియన్ వ్యూస్ తో సంచలనం సృష్టించింది.

గోల్డ్ మైన్స్ టెలిఫిల్మ్ యూట్యూబ్ చానెల్ లో హింది డిజె రిలీజ్ అయ్యింది. ఈ సినిమా యూట్యూబ్ లో వచ్చిన 71 రోజుల్లో 10 కోట్ల పైగా వ్యూస్ సాధించింది. ఈ సినిమా సాధించిన యూట్యూబ్ వ్యూస్ తో బన్ని క్రేజ్ నేషనల్ వైడ్ గా ఏ రేంజ్ లో ఉందో తెలుస్తుంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.