సాహో భామకు బంపర్ ఆఫర్..!

బాలీవుడ్ భామలకు టాలీవుడ్ లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అయితే అక్కడ రెమ్యునరేషన్ తో పోల్చి ఇక్కడ అవకాశాలను మిస్ చేసుకుంటారు భామలు. అయితే శ్రద్ధ కపూర్ మాత్రం అందుకు భిన్నంగా తెలుగులో ఆఫర్ రాగానే ఓకే అనేసింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన సాహో సినిమాలో నటిస్తున్న అమ్మడు ఆ సినిమా పూర్తి కాక ముందే మరో క్రేజీ ఆఫర్ సొంతం చేసుకుంది.

త్రివిక్రం డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ చేయబోతున్న సినిమాలో శ్రద్ధా కపూర్ ను సెలెక్ట్ చేశారట. ఈ సినిమాలో హీరోయిన్ ఆ ఎవరెవరి పేర్లో వినిపించగా ఫైనల్ గా శ్రద్ధను సెలెక్ట్ చేశారట. ఆమెతో చిత్రయూనిట్ చర్చలు కూడా ముగిశాయని టాక్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా మార్చి నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. సాహో ప్రభాస్ సినిమానే భారీ ఆఫర్ అనుకోగా శ్రద్ధకు యంగ్ టైగర్ తో అవకాశం రావడం చూస్తుంటే అమ్మడు టాలీవుడ్ లో చక్రం తిప్పుతుందని అంటున్నారు.