చమక్ చమక్ చాం.. లావణ్య మెరుపులు..!

కెరియర్ లో సూపర్ సక్సెస్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి వచ్చిన అరకొర అవకాశాతోనే ఆడియెన్స్ ను బుట్టలో వేసుకోవాలని చూస్తుంది. ప్రస్తుతం అమ్మడు మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ తో ఇంటిలిజెంట్ సినిమాలో నటించింది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని లావణ్య కాస్త గ్లామర్ డోస్ పెంచిందని టాక్. రీసెంట్ గా సినిమాలో చమక్ చమక్ చాం సాంగ్ రిలీజ్ అయ్యింది. 

మెగాస్టార్ పాటను మళ్లీ రీమిక్స్ చేసిన తేజ్ అదో క్రేజీ సెంటిమెంట్ గా భావిస్తున్నాడు. ఇక ఇదిలావుంటే ఈ పాటలో లావణ్య స్కిన్ షో ఆడియెన్స్ ను అలరిస్తుంది. ఫోటోల్లోనే ఈ రేంజ్ లో ఉంటే ఇక ఫుల్ సాంగ్ లో అమ్మడు రెచ్చిపోయిందని తెలుస్తుంది. ఎలాగైనా సరే కెరియర్ స్ట్రాంగ్ అయ్యేలా ప్రయత్నాలు చేస్తున్న లావణ్య త్రిపాఠి ఈసారి ఈ ఇంటిలిజెంట్ తో గ్లామర్ ఎటాక్ చేసిందని తెలుస్తుంది.  

మరి అమ్మడు కోరుకునే హిట్ ఈ ఇంటిలిజెంట్ ఇస్తాడా లేడా అన్నది చూడాలి. ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ముందు వారం రెండు భారీ సినిమాలు అదే రోజు మరో రెండు క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటన్నిటిని దాటి ఇంటిలిజెంట్ హిట్ అందుకుంటాడా లేదో చూడాలి.