త్రివిక్రం మళ్లీ అదే పంథా..!

మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్ అంటే అజ్ఞాతవాసి ముందు దాకా చాలా మంచి ఒపీనియన్ ఉండేది. అఫ్కోర్స్ ఇప్పటికి అదే భావన ఉన్నా అజ్ఞాతవాసి విషయంలో ఆయన చేసిన పొరపాట్లు ఆయన్ను ఓ మెట్టు కిందకు దించాయని చెప్పొచ్చు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడు త్రివిక్రం. ఈ సినిమా కథ కూడా ఓ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు అన్నది లేటెస్ట్ టాక్. మధుబాబు రచించిన డిటెక్టివ్ నవల ఆధారంగా త్రివిక్రం తారక్ సినిమా తెరకెక్కిస్తున్నాడట.

అయితే ఈ వార్త నిజమా కాదా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటికే ముహుర్త కార్యక్రమాలను ముగించుకున్న ఈ సినిమా మార్చి నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. త్రివిక్రం కాపీ డైరక్టర్ అన్న మాట మాత్రం ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయాలన్నిటికి త్రివిక్రం సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అజ్ఞాతవాసి సినిమా నిరాశ పరచడం ఒక ఎత్తైతే లార్గో వించ్ కథను తెలివిగా కాపీ చేశారన్న వాదనలే ఎక్కువగా వినిపించాయి. ఇప్పుడు తారక్ సినిమా కథ కూడా నవల కథ అంటున్నారు. వీటిపై త్రివిక్రం సీరియస్ గా ఆలోచించి ఈ రూమర్స్ కు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.