
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న నా పేరు సూర్య సినిమాకు కాపీ వివాదాలు అంటిస్తున్నారు. టీజర్ రిలీజ్ అయిన టైంలో రాజశేఖర్ సినిమాను పోల్చి చెప్పిన మీడియా ఇప్పుడు ఈ సినిమా ఓ హాలీవుడ్ కు ఫ్రీమేక్ గా రాబోతుందని చెబుతున్నారు. 2002లో వచ్చిన యాంట్వోన్ ఫిషర్ సినిమా కథతోనే నా పేరు సూర్య సినిమా తెరకెక్కిందని అంటున్నారు. ఆ సినిమా కథ ప్రకారం చిన్నతనం నుండి హింసాత్మకంగా మారిన వ్యక్తి నేవీలో చేరి సహ ఉద్యోగులను సైతం కొడుతూ ఉంటాడు. ఇక అతను అధికారి సహలా మేరకు సైకాలజిస్ట్ సలహా తీసుకుంటారట.
ఈ కథతోనే నా పేరు సూర్య వస్తుందని టాక్. అయితే టీజర్ లో బన్ని యాటిట్యూడ్ చూస్తే హాలీవుడ్ సినిమాకు ఈ కథకు దగ్గర పోలికలు ఉన్నట్టు తెలుస్తుంది. వక్కంతం వంశీ డైరక్షన్ లో వస్తున్న నా పేరు సూర్య సినిమా లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నారు. అజ్ఞాతవాసి సినిమా చూశాక కూడా నా పేరు సూర్య అలాంటి సాహసం చేస్తుందని అనుకోలేం. మరి నా పేరు సూర్య కాపీ మరక నుండి ఎలా బయట పడుతుందో చూడాలి.