
రీల్ లైఫ్ హీరోలుగా తమ సత్తా చాటుతున్న స్టార్లు రియల్ లైఫ్ లో కూడా మనసున్న హీరోలుగానే తమ మంచి తనం చాటుతున్నారు. ఆపద వస్తే తమకు తోచిన సహాయం అందిస్తూ మరికొందరికి ఆదర్శంగా మారుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ క్యాన్సర్ తో బాధపడుతున్న తనీష్ కు కావాల్సిన వైద్యం అందేందుకు కావాల్సిన పూర్తి ఆర్ధిక సహకారం అందించారు మహేష్.
ఇప్పుడు తనీష్ పూర్తిగా కోలుకోవడంతో మహేష్ కు కుటుంబ సమేతంగా కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే అటు ఆంధ్రాలో, ఇటు తెలంగాణాలో రెండు గ్రామాలను దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి సహకరిస్తున్న మహేష్ అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలకు తన వంతు సహకారం అందిస్తున్నాడు. ఇది నిజంగా ప్రశంసించాల్సిన విషయమే.