సైరాలో అమితాబ్ కూడా డౌటేనా..!

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా రాబోతున్న సైరా నరసింహారెడ్డి సినిమా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ తారాగణంతో 150 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా నుండి రోజుకో న్యూస్ సంచలనంగా మారుతుంది. ఇప్పటికే సినిమా నుండి సినిమాటోగ్రాఫర్ రవివర్మన్, మ్యూజిక్ డైరక్టర్ రెహమాన్ బయటకు రాగా ఇప్పుడు బిగ్ బి అమితాబ్ కూడా సినిమా నుండి ఎక్సిట్ అయ్యడని టాక్.

ప్రస్తుతం మొదటి షెడ్యూ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కు సిద్ధమవుతుంది. ఇలాంటి టైంలో బిగ్ బీ పై వచ్చిన న్యూస్ సంచలనంగా మారింది. అమితాబ్ ఉంటాడని తెలిసి సినిమాపై అంచనాలు ఏర్పడగా ఇప్పుడు ఆయన కూడా సినిమా నుండి బయటకు వచ్చాడని తెలిసి షాక్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ త్వరగానే స్పందించింది. అమితాబ్ గురించి వచ్చిన వార్తలన్ని రూమర్స్ మాత్రమే అని.. ఆయన సైరాలో ఆయన ఉంటున్నారని ఎనౌన్స్ చేశారు.