
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా సినిమా చూపిస్త మావ, నేను లోకల్ సినిమాలతో హిట్ అందుకున్న నక్కిన త్రినాధ రావు డైరక్షన్ లో ఓ సినిమా రాబోతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు ఎవరెవరినో అనుకోగా ఫైనల్ గా అనుపమ పరమేశ్వరన్ ను ఓకే చేశారట. హీరోయిన్ ఎంపిక విషయంలో రామ్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించాడట. రామ్ కోరిక మేరకే అనుపమను సెలెక్ట్ చేశారట.
ఇప్పటికే ఉన్నది ఒకటే జిందగి సినిమాలో రామ్, అనుపమ కలిసి నటించారు. ఆ సినిమా టైంలో ఏర్పడిన స్నేహంతో రామ్ మళ్లీ అనుపమకు అవకాశం ఇచ్చాడట. అసలైతే ఈ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తుందని అన్నారు. ఫైనల్ ఛాన్స్ మాత్రం అనుపమ కొట్టేసింది. ప్రస్తుతం యువ హీరోయిన్స్ అంతా తమ సత్తా చాటుతుంటే అనుపమ కూడా వరుస సినిమాలతో క్రేజ్ తెచ్చుకుంది. ఇదే కాకుండా నాని కృష్ణార్జున యుద్ధంలో కూడా అనుపమ లీడ్ హీరోయిన్ గా నటిస్తుంది.